India / Politics
చిన్నమ్మకు 'పెద్ద కుర్చీ'
229 days ago

రేపో మాపో అనుకున్న ముహూర్తం నేడో రేపో అనుకునే దాకా వచ్చేసింది. అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా  పార్టీ స్టీరింగ్ అందుకున్న శశికళ.. తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీక్కూడా కొద్దికొద్దిగా దగ్గరవుతున్నారు. జోడు పదవుల్ని చెరో చేత్తో పట్టుకుని 'బొమ్మాడించిన' అమ్మ మార్కు రాజకీయాన్నే చిన్నమ్మ కూడా అందిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది. 

 

జనరల్ సెక్రటరీగా పార్టీని చక్కదిద్దుతున్నట్లే.. ముఖ్యమంత్రి పదవినెక్కి ప్రజలను ఏలుకోవాలంటూ లోక్ సభ డెప్యూటీ స్పీకర్ తంబిదురై శశికళకు బహిరంగ లేఖ రాశారు. వీలైనంత త్వరగా సీఎం కుర్చీలో మిమ్మల్ని చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన లేఖలో చెప్పారు. పార్టీలోని సెకండ్ గ్రేడ్ లీడర్లతో లేఖలు రాయించుకుని.. తమ మనోభీష్టాలను ఆవిధంగా బైట పెట్టుకోవడం రాజకీయాల్లో మామూలే. అటువంటి జిమ్మిక్కుల్లో భాగమే ఈ తంబిదురై లేఖ అంటూ చెప్పుకుంటున్నారు. మరి.. పన్నీర్ సెల్వం మీటర్ ఆగిపోయ్యే ముహూర్తం దగ్గరపడిపోయినట్లేనా ?

 
 
Related News