World / General
తైవాన్ లో ..ఇదేం ఫ్యునెరల్....?
75 days ago

తైవాన్ లో ఓ సీనియర్ అధికారి కొడుకు తన తండ్రి కర్మకాండను వెరైటీగా నిర్వహించాడు. సుమారు 70 ఏళ్ళకు పైగా వయసున్న ఆయన అస్వస్థతతో మరణించగా.అతని  అంతిమ కోర్కె ప్రకారం ఆయన కొడుకు 50 మంది స్ట్రిప్పర్లకు డబ్బులిచ్చి మరీ అంతిమ యాత్ర నిర్వహించాడు. వీళ్ళంతా తమ వాహనాలపైకి ఎక్కి అర్ధనగ్న డ్యాన్సులు చేస్తూ దారిన పోయేవారినందరినీ ఆశ్చర్యపరిచారు.

దీంతో ఆ రోడ్డులో సుమారు రెండు గంటలపాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మా తండ్రికి లైఫ్ ని జాలీగా అనుభవించాలంటే చాలా ఇష్టం. అందుకే ఈ ఏర్పాటు చేశా..ఇలాంటి స్ట్రిప్పర్స్ డ్యాన్సులతో ఆయన ఆత్మ సంతోషిస్తుందని ఆశిస్తున్నా అంటున్నాడు గంతకు తగ్గ బొంత లాంటి ఆ తనయుడు. ఈ ఊరేగింపులో మరో 150 వెహికిల్స్ కూడా పాల్గొన్నాయి.  ఆ ఆసామీ   తన ఫేస్ బుక్ లో ఈ వైనాన్ని వివరించాడు కూడా.

 

 
 
 
Related News

JournalistDiary