World / Health
పెగ్గేస్తే చుక్కలే..
476 days ago

కిక్కు కోసం కొన్ని రకాల బ్రాండ్ల ఆల్కహాల్ కు అలవాటు పడిపోవడం మామూలే.. కానీ. ఈ కధనంలో మేం చెప్పే ఆల్కహాల్ బ్రాండ్లు ఒక్కసారి టేస్ట్ చేశారంటే మందులందు ఈ మందుల కిక్కేవేరయా.. అనడం ఖాయం. లేదంటే వా మ్మో? ఇదేం మందు ఇంత స్ట్రాంగ్ మా కొద్దు బాబోయ్ .. అనడం గ్యారంటీ అంటున్నారు. ఈ స్ట్రాంగ్ లిక్కర్ ను గనుక మీరు షాట్స్ తీసుకున్నట్టుగానో, బాటమ్స్ అని గాని ట్రై చేశారంటే ఇక లేవడం కష్టమేనట. ఒకపెగ్గు సరే. రెండో పెగ్గుకు మీరు స్ప్రహలో ఉండటం ఇంపాజిబుల్ అట. అంటే మొనగాడు స్ట్రాంగ్ లిక్కర్స్ అన్నమాట. సరే.. అవేంటో మీరూ ఒక లుక్కేయండి.

 

1. బకార్డీ 51...75 శాతం ఆల్కహాల్ ఉండే రమ్ బెర్ముడా లోని బకార్డీ లిమిటెడ్ ఆఫ్ హామిల్టన్ కంపెనీ తయారు చేసిన ఈ స్ట్రాంగ్ రమ్ హై లీ ఇన్ ఫ్లేమబుల్ రమ్. ప్రపంచంలో స్టీల్ ఫ్రేం అరెస్టర్ ఉండే రమ్.. డెవిల్ స్ప్రింగ్స్ ఓడ్కా.. 80 శాతం ఆల్కహాల్ కలిగి ఉండే ఓడ్కా.. దీన్ని నేరుగా తీసుకోవడం అంత మంచిది కాదు. కానీ ఫ్రూట్ జ్యూస్ తో, లేదా మంచి  కాక్ టైల్స్ తో కలిపి తీసుకుంటే  హ్యపీగా ఉంటుందట.

 

2. సన్ సెట్ రమ్.. 84.5 శాతం ఆల్కహాల్ కలిగి ఉండే రమ్.సెయింట్ విన్సెంట్ డిస్టిలరీస్ కంపెనీ తయారుచేసిన వరల్డ్ క్లాస్ రమ్. ఇది ఎంత స్ట్రాంగ్ అంటే..బాటిల్  లేబిల్ మీదే.. ఇది వాడితే కడుపు మండుతుంది జాగ్రత్త అని రాసి ఉంటుంది. కాబట్టి ఏదైనా మిక్సర్ డ్రింక్ తో కలిపి తాగటం శ్రేయస్కరం అట. 

 

3. బల్కాన్176 వోడ్కా. 88 పర్సెంట్ ఆల్కహాల్ కలిగి ఉండే బాల్కాన్ వోడ్కా ది పుట్టినిల్లు బల్గేరియా. ఈ ట్రిపుల్ డిస్టిల్డ్ వోడ్కా కలర్ లెస్ అండ్ టేస్ట్ లెస్.. అలానే వాసన కూడా ఉండదు. ఈ స్ట్రాంగ్ వోడ్కా  తక్కువ సమయంలో ఎక్కువ తాగడంతో చాలా  మంది ప్రాణాలు పోగొట్టుకున్నారట.

 

 4. పిన్సెర్ షాంగాయ్ స్ట్రెంగ్త్  వోడ్కా.. 88. 88  పర్సెంట్  ఆల్కహాల్ కలిగి ఉండే వోడ్కా. కానీ బొటానికల్  పదార్ధాలు, పాలపదార్ధాలు కలిపి తయారు చేయడం వల్ల  ఎటువంటి ప్రమాదం  లేదంటున్నారు. అంతేకాకుండా ఈ వోడ్కాను మందుగా కూడా వాడుతుంటారట.

 

5. హ్యప్స్ బర్గ్  గోల్డ్ గ్లోబల్ ప్రీమియం రిజర్వ్ ...89.9 శాతం ఆల్కహాల్ కలిగి ఉండే  హ్యాప్స్ బర్గ్  లేబిల్ మీద  దేర్ ఆర్  నో..రూల్స్ అనే స్లోగన్ రాసి ఉంటుంది.  ఈ మందు దేనితో నైనా కలిపి తీసుకోవచ్చట. ఈ మందుకడుపులోకి దిగగానే బుర్రలోకి కొత్త కొత్త అయిడియాలు పుట్టుకొచ్చేస్తాయట.

 

6. రివర్ ఆంటోయిన్ రాయల్ జెనరేషన్ రమ్.. 90 పర్సెంట్ ఆల్కహాల్ ఉండే  గ్రనేడియన్ రమ్. ప్రాచీన పద్దతుల్లో  గ్రనేడాలో తయారయ్యే  ఈ  రమ్ ను  వెరీ స్లో  డిస్టిలింగ్ పద్దతిలో తయారవుతుందట. బాగా పులియబెట్టిన చెరకు రసం నుంచి మచి సువాసన కలిగిన రమ్ వస్తుందట.      

 

7. బ్రూక్ లాడిక్ X4 క్వాడ్రపుల్డ్ విస్కీ.. 92 పర్సెంట్ ఆల్కహాల్ కలిగిన విస్కీ. దీని గొప్ప గురించి చెప్పుకోవాలంటే..బ్రూక్ లాడిక్ అత్యధికంగా ఆల్కహాల్ కలిగి ఉండే సింగిల్ మాల్ట్  విస్కీ..17 సెంచరీ నాటి డిస్టలరీ పద్థతుల్లో యారయ్యే ఈ విస్కీ  ప్యూర్ గా ఉంటుందట. ఈ విస్కీ ఒక సిప్ వేస్తే..బతికుంటారట. రెండు సిప్పులు వేస్తే కళ్లు కనిపించవట. మూడు సిప్పులు వేస్తే...ఆన్ ది స్పాట్ గుటుక్కుమనడం ఖాయమంటారు స్థానికులు.

 

8. ఎవర్ క్లియర్ గ్రెయిన్. గురించి  చెప్పుకోవాలంటే 95 పర్సెంట్ ఆల్కహాల్ కలిగి ఉండే డ్రింక్ ని  మీరు ఇంతవరకూ ఇలాంటి స్ట్రాంగెస్ట్ ఆల్కహాల్  టేస్ట్ చేసి  ఉండరు. పైగా టేస్ట్  చేయక పోవడమే హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అని అంటున్నారు. ఆఖరికి దీని లేబుల్ మీద ఈ డ్రింక్ తాగడం శ్రేయస్కరం కాదు అని రాసి ఉంటుంది

9. చివరిగా స్పైరైటస్ స్టావిస్కీ.. రస్యాలో తయారయ్యే ఈ విస్కీ  లిక్కర్  ప్రపంచం మొత్తంలో స్ట్రాంగెస్ట్ లిక్కర్ అనిచెబుతారు. ప్రీమియం ఈథైల్ ఆల్కహాల్  నుంచి తయారయ్యే ఈ విస్కీ తాగనోడే మొనగాడు గా చెబుతుంటారు. ఒక్క పెగ్గు కడుపు లోకి దిగితే మొత్తం కదిలిపోతుందట. ఆఖరికి ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమౌతుందట. అదీ  మందు మ్యాటర్.

 

Read Also

 
Related News
JournalistDiary