AP and TS / Crime
జైలు గోడల మధ్య ఆ 12 సంవత్సరాలు !
70 days ago

హైదరాబాద్ గ్రీన్ ల్యాండ్స్ సిట్ కార్యాలయంలో బాంబు దాడి సంఘటన జరిగి 12 ఏళ్ళు గడిచిపోయాయి. గురువారం కోర్టు తీర్పు వచ్చింది. ఇరవై మందిని నిందితులుగా పేర్కొన్నారు పోలీసులు. పరారీలో ఉన్నవాళ్ళ సంగతి పక్కన పెడితే మిగిలిన పది మందిని జైల్లో పెట్టారు. ఇప్పుడు కోర్టు వీరందరినీ నిర్దోషులుగా పేర్కొంది. వాళ్ళను నిందితులుగా పేర్కొనడానికి సాక్ష్యాలే లేవంటూ కోర్టు తీర్పు చెప్పింది. అంటే వీరంతా పన్నెండు సంవత్సరాల పాటు శిక్షింపబడినట్టే ! అండర్ ట్రయల్స్ గా జైల్లో 12 ఏళ్ళు తమ విలువైన జీవితాన్ని కోల్పోయారు. దీనికి ఎవరు బాధ్యత వహించాలి ? ప్రభుత్వమా లేక పోలీసులా ? ఎవరైనా ఒకటే..జవాబుదారీతనం వహించాల్సిందే ! 

 

దాడి జరిగి పుష్కరాలు గడిచిపోయినా పకడ్బందీ ఆధారాలతో కోర్టుకు వెళ్ళాల్సిన పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని చెప్పక తప్పదు." జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డివైడ్ " అనే ఆంగ్ల నానుడికి ఈ కేసు ఒక ఉదాహరణ. ఇక ఇదే కేసు విషయమై మజ్లిస్ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. నిందితులుగా ముద్ర పడి జైల్లో 12 ఏళ్ళు మగ్గిపోయిన వ్యక్తులు తమ అమూల్యమైన జీవిత కాలాన్ని కోల్పోయినందుకు పోలీసులు బాధ్యత వహించాలంటూ ట్వీట్ చేశారు. పోలీసులు మాత్రం కేసు పూర్తి పాఠం చదివిన తర్వాత పై కోర్టుకు అప్పీల్ చేసుకునే విషయం పరిశీలిస్తామని చెబుతున్నారు.

 

Read Also

 
Related News
JournalistDiary