World / Health
కూల్ కిల్లర్స్
513 days ago

అవునా.. అంటే యస్ అంటున్నారు ఎక్స్‌పర్ట్స్.  రోజుల తరబడి ఫ్రిజ్ లో ఉన్న ఆహారాన్ని తినడం అంత మంచిది చెబుతున్నారు. ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు నిల్వ ఉంచే ఆహార పదార్థాల్లో శీతల ఉష్ణోగ్రతకు రసాయనిక చర్య జరుగుతుందని... ఈ పదార్థాలను తినడం వల్ల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదముందని ఫుడ్ స్టాండర్స్ ఏజెన్సీ చెబుతోంది. ముఖ్యంగా మిల్క్ ప్యాకెట్స్ ను ఫ్రిజ్‌లో ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదంటోంది. 

పాల ప్యాకెట్లను ఫ్రిజ్‌లో కింద అరల్లోనే నిల్వ ఉంచాలని సలహా ఇస్తోంది. ఎందుకంటే ఫ్రిజ్‌లో కూలింగ్ అన్ని అరల్లో ఒకే విధంగా ఉండదని, పాలను కూలింగ్ ఎక్కువగా ఉండే పైఅరల్లో పెట్టడం వల్ల బ్యాక్టీరియా తయారై అనారోగ్యానికి దారి తీస్తుందంటున్నారు. తేనె, కర్బూజా, బ్రెడ్, అరటిపళ్లు, ఉల్లిపాయలు, ఆలివ్ ఆయిల్, టొమాటో వంటివి ఫ్రిజ్ లో నిల్వచేయకుండా, చల్లని పొడి ప్రదేశంలో ఉంచడమే చాలా బెటరంటున్నారు. 

 

 

Read Also

 
Related News
JournalistDiary