World / General
వందేళ్లైనా చెక్కు చెద‌రని ఫ్రూట్ కేక్
10 days ago

మంచుతోవుండే అంటార్కిటికా ప్రాంతంలో 100 ఏళ్ల నాటి ఫ్రూట్ కేక్ ప‌రిశోధ‌కుల‌కు దొరికింది. అది ఏమాత్రం చెక్కు చెద‌ర‌కుండా ఇప్పటికీ తిన‌డానికి బాగానే ఉన్నట్లు వెల్లడించారు. న్యూజిలాండ్‌కు చెందిన అంటార్కిటిక్ హెరిటేజ్ ట్రస్ట్ రీసెర్చర్లు తూర్పు అంటార్కిటికాలోని ఓ ఇగ్లూను గుర్తించారు. ఇందులోవాళ్లకి ఓ ప్యాకెట్ కనిపించింది. అందులో ఫ్రూట్ కేక్ ఉన్నట్లు తెలియజేశారు.

కేక్.. 1910- 1913 ప్రాంతంలో బ్రిటిష్ సాహసికుడు రాబర్ట్ ఫాల్కన్ అంటార్కిటికా సాహసయాత్రను చేపట్టినప్పుడు దీన్ని తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. కేక్ ప్యాకెట్ కొద్దిగా దెబ్బతిన్నా అక్కడి వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల కార‌ణంగా తిన‌డానికి బాగానే వుండడం గమనార్హం. ఇక హంట్లీ అండ్ పామ‌ర్స్ కంపెనీ ఈ కేక్‌ను త‌యారు చేసిన‌ట్లు ఆ ప్యాకెట్ మీద వుంది. 1822 నుంచి బేక‌రీ బిజినెస్ చేసింది ఆ సంస్థ. ఈ తరహా ప్రాంతాన్ని సంద‌ర్శించిన‌పుడు ఎక్కువ శ‌క్తి కావాలని, ఈ విషయంలో ఫ్రూట్‌కేక్ కంటే చ‌క్కని ఆహారం మ‌రొక‌టి లేద‌ంటున్నారు పరిశోధకులు. 

 
 
Related News