World / General
105 ఏళ్ళ తాతయ్య సైకిల్ తొక్కి........
75 days ago

 ఆ తాతయ్య మహా చురుకైనవాడు. 105 ఏళ్ళ వయస్సులోనూ రామా, కృష్ణా అంటూ  ఇంట్లో కూచోక సైకిల్ వీరుడయ్యాడు. ప్యారిస్ లో నిర్వహించిన ఓ సైకిల్ ఈవెంట్ లో...   గంటలో సుమారు 14 మైళ్ళు సైకిల్ తొక్కి వావ్ అనిపించాడు. రాబర్ట్ మర్చంద్ అనే ఈ తాత చేసిన ఈ ఫీట్ చూసి అంతా ఆశ్చర్యపోతూనే ఆనందంతో కేకలు పెట్టారు.

వయస్సు మీద పడిందని, ఏమీ చేయలేమని  వృద్ధులెవరూ చింతించనక్కరలేదని, ఇన్నేళ్ళు వచ్చినా సైకిల్ తొక్కగలనని నిరూపించిన తనను చూసి ముసలివారంతా స్ఫూర్తి పొందాలని ఆయన అంటున్నాడు. గతంలో ఫైర్ ఫైటర్ గా, ట్రక్ డ్రైవర్ గా పని చేసిన రాబర్ట్..కేవలం పండ్లు, కూరగాయలు మాత్రమే తింటాడు. స్మోకింగ్ చేయడట. మద్యం ముట్టడట. టీవీ కూడా ఎక్కువసేపు చూడడట. రోజూ కొద్దిసేపు వ్యాయామం చేయడం..రాత్రి 9 గంటలకల్లా నిద్రకోసం మంచమెక్కడం ఇతని అలవాటు  తన 68 వ ఏట నుంచే సైకిల్ తొక్కుతూ వచ్చిన రాబర్ట్ 105 ఏళ్ళ వయస్సులో ఈ ఫీట్ చేసి  తన రికార్డును తానే అధిగమించాడు. ప్రపంచ రికార్డు సృష్టించాడు.

 

 
 
 
Related News

JournalistDiary