India / Sports
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో 120 కోట్ల స్కామ్
33 days ago

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో 120 కోట్ల భారీ కుంభకోణం జరిగింది. డిలాయిట్ సంస్థ జరిపిన దర్యాప్తులో ఈ స్కాం బయటపడింది. హెచ్ సీ ఏ ప్రెసిడెంట్ అర్షద్ ఆయూబ్, సెక్రటరీ జాన్ మనోజ్, మరో ఏడుగురిపై హైదరాబాద్ ఉప్పల్ పోలీసు స్టేషన్లో ఐ పీ సీ 403, 406,415 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గత రెండున్నర సంవత్సరాల్లో నిధుల దుర్వినియోగం భారీగా జరిగిందని, అవసరం లేకున్నా ఉప్పల్ స్టేడియం రెనోవేషన్ కోసమంటూ నకిలీ బిల్లులు సృష్టించి అసోసియేషన్ సొమ్మును దోచుకున్నారని హెచ్ సీ ఏ సభ్యులు ఆరోపిస్తున్నారు.

మాజీ అధ్యక్షుడు జి.వినోద్, పురుషోత్తం అగర్వాల్ పెద్ద ఎత్తున నిధులను గోల్ మాల్ చేశారని అంటున్నారు. హెచ్ సీ ఏ చరిత్రలోనే ఇదో అతి పెద్ద కుంభ కోణమని చెబుతున్నారు. బీసీసీఐ కి శశాంక్ మనోహర్ ప్రెసిడెంటుగా ఉన్నప్పుడు నియమించిన డిలాయిట్  సంస్థ తన 78 పేజీల నివేదికలో ఈ స్కాం ను బయట పెట్టింది. ఈ సంస్థను 2014-15 లో ఏర్పాటు చేయగా ఏ సీ బీ కూడా ఈ కుంభకోణంపై దర్యాప్తు జరిపింది.

 


 
 
 
Related News

JournalistDiary