World / Health
భారతీయులకు జికా వైరస్
415 days ago

గతంలో బ్రెజిల్ ను వణికించిన జికా వైరస్ ఇప్పుడు సింగపూర్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దోమకాటు ద్వారా వ్యాప్తి చెందే జికా వైరస్ నిర్మూలనకు సింగపూర్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నా జికా కేసులు మాత్రం పెరిగిపోతూనే ఉండటం ఆదేశాన్ని కలవరపరుస్తోంది.

సింగపూర్లో 13 మంది భారతీయులు జికా బారినపడ్డారు. భారత విదేశాంగశాఖ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. తాజాగా వైద్యులు జరిపిన టెస్టుల్లో భారతీయులకు ఈ వైరస్ సంక్రమించినట్లు నిర్ధారణ అయింది. మొదటగా భవన నిర్మాణ కార్మికులలో జికా వైరస్ వ్యాప్తి చెందినట్లు గుర్తించారు.

ఇప్పటికే సింగపూర్ లో వందల మందికి జికా వైరస్ సంక్రమించింది. దీంతో గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు, వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గర్బిణీలకు జికా వైరస్ వ్యాప్తి చెందితే పుట్టబోయే పిల్లలు చిన్న తలతో పుట్టడంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

 

Read Also

 
Related News
JournalistDiary