India / Crime
పట్టాలు తప్పి.. ఒక్కసారిగా..
232 days ago

యూపీలోని కాన్పూర్ దగ్గర బుధవారం అజ్మీర్-సిల్దా ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ రైలుకు చెందిన 14 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, 40 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

కాన్పూర్‌కు 70 కి.మీ. దూరంలోని రూర రైల్వేస్టేషన్ దగ్గర ఈ రైలు ప్రమాదానికి గురి కాగా.. ప్రమాద కారణంపై విచారణకు ఆదేశించారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దీంతో ఢిల్లీ-హౌరా మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

 
 
Related News