World / Entertainment
ఇరాన్ పార్లమెంట్‌లో కాల్పులు
71 days ago

ఇరాన్ పార్లమెంటు ఉగ్రవాదుల కాల్పులతో దద్దరిల్లింది. ఓ మహిళా సూసైడ్ బాంబర్ సహా మరో ఇద్దరు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు  సెక్యూరిటీ గార్డును కాల్చి చంపిన వీరు పార్లమెంటు భవనంలోకి దూసుకుపోయారని  నలుగురిని బందీలుగా పట్టుకున్నారని తెలిసింది పిస్టల్ తో ఒకరు, ఏకే -47 రైఫిళ్ళతో ఇద్దరు జొరబడినట్టు. తెలుస్తోంది.  

అటు- ఈ భవనానికి సమీపంలోని ఆయతుల్లా ఖోమైనీ సమాధి స్థలం వద్ద జరిగిన కాల్పుల్లో  ఏడుగురు మరణించగా పలువురు గాయపడ్డారని తస్మిన్ వార్తా సంస్థ పేర్కొంది. పార్లమెంటుపై జరిగిన దాడి సందర్భంలో ఒక ఉగ్రవాదిని భద్రతా దళాలు చుట్టు ముట్టాయని ఓ ఎంపీ తెలిపారు. అయితే ఆ ఉగ్రవాదిని పట్టుకున్నారా అన్న విషయం తెలియలేదు. ఇలా ఉండగా, కొద్ది సేపటి తరువాత పార్లమెంట్ సమావేశాలు మళ్ళీ ప్రారంభమయ్యాయని,  ఓపెనింగ్ సెషన్ యధా ప్రకారం సాగిందని ఇరానియన్ టీవీ తెలిపింది.

ఖొమైనీ స్మారకం వద్ద మహిళా ఉగ్రవాది తనను తాను పేల్చివేసుకున్నట్టు తెలిసింది. ఉగ్రవాదులు తుపాకులతో పార్లమెంట్ భవనం కిటికీల వద్ద నిలబడిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. పార్లమెంట్ భవనంలో ఓ ఉగ్రవాది తనను తాను పేల్చివేసుకున్నాడని, భవనంలో చిక్కుకున్నవారిని భద్రతా దళాలు సురక్షితంగా బయటికి చేర్చాయని వార్తలందాయి. ఆ ప్రాంతమంతా యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోందని ఓ ప్రత్యక్ష సాక్షి పేర్కొన్నాడు. ఈ దాడులు తమ పనేనని ఐసిస్ ప్రకటించుకొంది.

 

Read Also

 
Related News