World / Crime
ఇద్దరు భారతీయులు కూడా..
116 days ago

టర్కీలోని ఇస్తాన్‌బుల్‌లో ఓ ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో మరణించిన 39 మందిలో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నారు. మాజీ ఎంపీ అఖ్తర్ హసన్ రిజ్వీ తనయుడైన అబిస్ రిజ్వీ, గుజరాత్ కు చెందిన ఖుషీ షా అనే వ్యక్తులు ఆ ఘటనలో మరణించారని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు.

ముంబైకి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ అబిస్ రిజ్వీ ఇటీవల రోర్..ది టైగర్స్ ఆఫ్ సుందర్‌‌బన్స్ అనే బాలీవుడ్ చిత్రాన్ని తీశాడు. తన మరో చిత్రం షూటింగ్ కోసం ఆయన టర్కీ వెళ్లినట్టు తెలిసింది.

కాగా ఇస్తాన్‌‌‌బుల్ లోని ఓ నైట్‌క్లబ్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నవారిపై శాంతాక్లజ్ దుస్తుల్లో వచ్చిన ఓ టెర్రరిస్ట్ విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 39 మంది మృతి చెందిన సంగతి విదితమే. ఆ ఘటనలో దాదాపు 70 మంది గాయపడ్డారు.



 

 
 
 
Related News

JournalistDiary