India / Politics
2017 బ్యాలెట్ యుద్ధంలో గెలుపెవరిది?
80 days ago

దేశంలోని 7రాష్ట్రాల్లో అధికారం చెలాయిస్తో్న్న పార్టీల తలరాతల్ని..విపక్షాలుగా ఉన్న పార్టీల భవితవ్యాన్ని నిర్ణయించనుంది 2017. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీల పదవీకాలం ఈ ఏడాతో ముగియునుండటంతో ఈ ఏడాదిలో ఎన్నికలు ఎదుర్కోబోతున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే, ఈ రాష్ట్రాల్లో ప్రజలు ఏపార్టీలకు మగ్గుచూపే అవకాశం ఉందన్నది ఒకసారి పరిశీలిస్తే...

ఉత్తరప్రదేశ్: 139 మిలియన్ల ఓటర్లున్న ఉత్తరప్రదేశ్ లో 403 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 2012 ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అత్యధికంగా 224 స్థానాలు కైవసం చేసుకుంది. బిఎస్పీ 80 స్థానాలు సాధించి రెండో స్థానంలో 47 స్థానాలు సాధించి బీజేపీ మూడో స్థానం పొందాయి. 

 

రియాల్టీ చెక్:  యూపీలో కొంతకాలంగా అధికారం సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీ ల మధ్య మారుతూ వస్తోంది. అయితే, 2014లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తన సత్తాచాటింది. అయితే, ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల పొత్తులే విజయాల్ని నిర్ణయిస్తాయని భావిస్తున్నారు. 

పంజాబ్: 19.6 మిలియన్ల ఓటర్లున్న పంజాబ్ లో 117 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2012ఎన్నికల్లో శిరోమణి అకాలీదల్ 56 స్థానాలు గెల్చుకోగా, కాంగ్రెస్ 46స్థానాలు సాధించి రెండో స్థానం లో నిలిచింది. బిజెపి 12స్థానాలుపొందింది. 

రియాల్టీ చెక్: పంజాబ్ ఎన్నికల్లో యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టర్ పనిచేసి అధికార బిజెపి-శిరోమణి అకాలీదళ్ కు ముప్పుతెచ్చే అవకాశం లేకపోలేదు. ఆప్ పంజాబ్ లో తన పరిధిని పెంచుకునే అవకాశం ఉంది. 

ఉత్తరాఖండ్:  7.1మిలియన్ ఓటర్లున్న ఉత్తరాఖండ్ లో 70 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2012 ఎన్నికల్లో దెబ్బాదెబ్బగా కాంగ్రెస్ 32, బిజెపి 31 స్థానాల్లో విజయం సాధించాయి. రియాల్టీ చెక్: ఈ సారిఎన్నికల్లో అవినీతి ఆరోపణలు అధికార కాంగ్రెస్ కు ఇబ్బందులు తెచ్చే అవకాశం కనిపిస్తోంది.  

గోవా: 1.1 మిలియన్ మంది ఓటర్లున్న గోవాలో 40 అసెంబ్లీ సీట్లున్నాయి. గతఎన్నికల్లో బిజెపి 21, కాంగ్రెస్ 9 స్థానాల్లో గెలుపొందాయి.

రియాల్టీ చెక్: అవినీతిపై కాంగ్రెస్ పోరు సాగించలేకపోవడం ఒకటైతే, ఆప్ గోవా ఎన్నికల్ని సవాల్ లా తీసుకోవడం కనిపిస్తోంది.

మణిపూర్: 1.8మిలియన్ల ఓటర్లున్న మణిపూర్ లో 60 అసెంబ్లీ సీట్లున్నాయి. గతఎన్నికల్లో కాంగ్రెస్ 42 స్థానాలు పొంది అధికారంలో ఉంది.

రియాల్టీ చెక్:  కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వ, అవినీతి ఆరోపణలతో సతమవుతోంది.

గుజరాత్: 4.8 మిలియన్ల ఓటర్లున్న గుజరాత్ లో 182 అసెంబ్లీ స్థానాలున్నాయి. గతఎన్నికల్లో బిజెపి 115 స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చింది. 

రియాల్టీ చెక్: ఈ ధఫా ఎన్నికల్లో ఆప్ దళిత్, పతిదాస్, ముస్లిం ఓటర్ల మీద కన్నేసింది. యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టర్ అధికార పార్టీమీద ఎలా ఉంటుందో చూడాలి. 

హిమాచల్ ప్రదేశ్: 40.6 మిలియన్ల ఓటర్లున్న హిమాచల్ ప్రదేశ్ లో 68 అసెంబ్లీ స్థానాలున్నాయి. గతఎన్నికల్లో కాంగ్రెస్ 36 స్థానాలు సాధించగా, బిజెపి 26 స్థానాల్లో గెలుపొందింది. 

రియాల్టీ చెక్ : తాజాగా జరిగిన పంచాయితీ ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్ మధ్య నెక్ టు నెక్ పోటీ సాగింది. 

 

 
 
 
Related News

JournalistDiary