Telangana / Crime
యూఎస్‌లో తెలుగు స్టూడెంట్ సూసైడ్
9 days ago

అమెరికాలో తెలుగు స్టూడెంట్ రాజావంశీ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. 23 ఏళ్ల ఈ విద్యార్థి.. తాను చదువుతున్న మిచిగాన్ యూనివర్సిటీలో ఉరేసుకున్నాడు. కారణం ఏంటన్నది తెలియరాలేదు. దీనిపై విచారణ చేపట్టారు అక్కడి పోలీసులు. ఫ్లోరిడా లోవున్న రాజా, కొన్ని నెలల కిందటే మిచిగాన్ యూనివర్సిటీకి వెళ్లాడు.

మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వంశీరెడ్డి సొంతూరు తెలంగాణ కాగా, ఆయన ఫాదర్ గవర్నమెంట్ టీచర్. రాజా ఆత్మహత్య విషయాన్ని ఆయన పేరెంట్స్‌కి మిచిగాన్ పోలీసులు తెలిపారు. కొడుకు లేడన్న వార్త తెలియగానే ఆ పేరెంట్స్ కన్నీరు మున్నీరయ్యారు. మరోవైపు రాజావంశీ రెడ్డి మృతదేహాన్ని మిచిగాన్ నుంచి తెలంగాణకు తరలించేందుకు అక్కడి తెలుగు వారు ఆన్‌లైన్‌లో ఫండ్ రైజ్ చేయడం మొదలుపెట్టారు.

 

Read Also

 
Related News
JournalistDiary