World / Health
30 నిముషాలు నడిస్తే..లక్షన్నర
290 days ago

వాకింగ్ అన్నది బాడీకి చాలా మంచిదట. మంచి హెల్త్ కి ఇది టానిక్ లా పని చేస్తుందని అంటున్నారు నిపుణులు. భారీగా ఎక్సర్ సైజ్ చేసి ఆయాసపడేకన్నా కేవలం 30 నిముషాలు వాకింగ్ చేస్తే చాలా బెటరని చెబుతున్నారు. ఇలా చేసినందువల్ల మెడికల్ కాస్ట్స్ (వైద్యపరమైన బిల్లులు) చాలావరకు తగ్గుతాయని, ఏడాదికి 2,500 డాలర్లు (రూ.లక్షా అరవై ఆరు వేలు) ఆదా చేయవచ్చునని పరిశోధకులు తెలిపారు. వారంలో ఐదు  రోజులు అరగంట సేపు నడిస్తే చాలునని కూడా అమెరికాలోని రీసెర్చర్లు భరోసా ఇస్తున్నారు.

26 వేలమందికి పైగా మగవారిని, మహిళలను ఎనాలిసిస్ చేసినప్పుడు ఈ విషయం తేట తెల్లమైందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తన మ్యాగజైన్ లో పేర్కొంది.వాకింగ్ లేదా ఎక్సర్ సైజ్ లేకుండా ఇనాక్టివ్ గా ఉంటే ఏడాదికి 68 బిలియన్ డాలర్ల మెడికల్ బిల్లులు భరించాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. తాము రెండు గ్రూపులుగా వీరిని విభజించామని, ఓ గ్రూప్ 30 నిముషాలు వాకింగ్ చేస్తే..మరో గ్రూప్ దీనికి దూరంగా ఉందని వాకింగ్ చేసిన గ్రూప్ ఏడాదిలో 2,500 డాలర్లను సేవ్ చేయగలిగిందని ఈ పరిశోధకులు పేర్కొన్నారు. ఇక-మద్యం తాగడం వల్ల కలిగే దుష్పరిణామాలు ఎక్సర్ సైజ్ చేసినందువల్ల తగ్గిపోతాయట. 


 

 
 
 
Related News

JournalistDiary