World / Health
దోమ కాటుకు ఓ లెక్కుంది
315 days ago

చలికాలం లేదా వేసవికాలంలో దోమల వల్ల వచ్చే బాధ అంతాఇంతా కాదు. డైనోసార్ల కాలం నుంచి భూమి మీద దోమల ఉనికి ఉందట. శీతాకాలంలో వీటి సంచారం కొంచెం తక్కువగావున్నా, వానాకాలం మొదలయ్యే సీజన్ నుంచి వీటి దాడి ఎక్కువ అవుతుంది. వీటి కాటు కారణంగా మలేరియా, డెంగీ, చికెన్ గునియా, జికా లాంటి వ్యాధుల వ్యాప్తి చెందుతాయి. గతేడాది ఒక్క ఢిల్లీలోనే అనేకమంది డెంగీ బారినపడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. సుమారు 1259 మంది దోమకాటుతో అనారోగ్యం పాలయ్యారు. ఇదిలావుంటే దోమ మనిషిని బట్టి కుడుతుందంటున్నారు డాక్టర్లు... అందుకు నాలుగు కారణాలు వెల్లడించారు. మనిషి శరీరంలో లాక్టిక్ యాసిడ్ అధికంగా ప్రొడ్యూస్ అయితే దోమలు ఎక్కువగా కుట్టే అవకాశం ఉందట.

ఎందుకంటే శరీరం నుంచి వెలువడే చెమట‌లో వుండే లాక్టిక్ యాసిడ్ తీయగా ఉంటుందట. దీనివల్ల దోమలు లాక్టిక్ యాసిడ్ ఎక్కువగావున్న వాళ్లను కుడతాయని చెబుతున్నారు. ముఖ్యంగా వయసు మళ్ళినవారు తమ శరీరాన్ని వేసవికాలంలో పట్టిన చెమటను తడిగుడ్డతో శుభ్రం చేసుకోకుంటే దోమకాటు నుంచి తప్పించుకోవచ్చంటున్నారు డాక్టర్లు. అలాగే చర్మంపై బాక్టీరియా  ఎక్కువగావున్నా దోమకాటు తప్పదట. చర్మంపై ఉండే కొన్ని బాక్టీరియాలు దోమలని తరిమేస్తే, మరికొన్ని దోమలను ఆకర్షిస్తాయట.

చర్మంపై ఉండే స్టెఫిలోకాకస్, వేరియోవరాక్స్ అనే  రెండు రకాల బాక్టీరియాలు దోమలను ఎక్కువగా ఆకట్టుకుంటే, సూడోమోనాస్, డెల్ఫిటియా, లెఫ్టోట్రికియా లాంటి బాక్టీరియాలు దోమలను తరిమేస్తాయని వివరిస్తున్నారు. మానవ శరీరంలో ఉండే  రక్తం బట్టి కూడా దోమకాటు అధికంగా ఉంటుందంటున్నారు.  ఓ, బీ, ఎ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లను దోమలు ఎక్కువగా కాటేస్తాయని, అలాగే శ్వాసక్రియలో విడుదలయ్యే కార్బన్ డై ఆక్సైడ్ శాతం ఎక్కువయినా దోమకాటు తప్పదని అంటున్నారు. కానీ ఆక్సిజన్ పీల్చుకుని.. కార్బన్ డై ఆక్సైడ్ బయటకు వదలటం మానవ సహజం. సో.. కార్బన్ డై ఆక్సైడ్ వదిలినప్పుడు మనల్ని దోమలు కుట్టడం సహజం.

 
 
 
Related News

JournalistDiary