India / Crime
10మంది కుటుంబ సభ్యులను చంపి....
168 days ago

యూపీలోని అమేథీలో ఇదో దారుణం. 50 ఏళ్ళ ఓ వ్యక్తి తన కుటుంబంలోని 10 మందిని హత్య చేసి తానూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జమాలుద్దీన్ అనే ఈ వ్యక్తి డ్రగ్స్ తీసుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇద్దరు మహిళలు, 8 మంది కూతుళ్ళకు మత్తుమందిచ్చి, వారు నిద్రలో ఉండగా వారి గొంతుకలు కోసి హత్య చేశాడు. ఈ ఘటనా స్థలంలో పోలీసులకు రెండు కత్తులు కనిపించాయి. ఇతని సోదరుని కూతుళ్ళు కూడా ఇతని అమానుషానికి బలయ్యారు. ఇరవై ఏళ్ళ క్రితం జమాలుద్దీన్ తన మొదటి భార్యకు విడాకులిచ్చాడని, కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధ పడుతున్నాడని తెలిసింది. అయితే తనే ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడా లేక ఎవరైనా ఇతడిని హత్య చేశారా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

 

 
 
 
Related News

JournalistDiary