Telangana / Crime
దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ళ కేసు తీర్పు
247 days ago

హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ళ కేసులో ఆరుగురు నిందితులను దోషులుగా కోర్టు పేర్కొంది. వారి  శిక్షలను త్వరలో ఖరారు చేయనున్నారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా ప్రత్యేక సెషన్స్ కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది.

2013 ఫిబ్రవరి 21 న దిల్‌సుఖ్‌నగర్ వద్ద జరిగిన జంట పేలుళ్ళ ఘటనలో 19 మంది మరణించగా..131 మంది గాయపడ్డారు. ఇండియన్ ముజాహిదీన్ కో- ఫౌండర్ యాసిన్ భత్కల్ తో బాటు అసదుల్లా అఖ్తర్, తహసీన్ అఖ్తర్, జియవుర్ రెహమాన్, ఎజాజ్ షేక్ లను ఎన్ఐఏ  అరెస్ట్ చేసిన సంగతి విదితమే.

చర్లపల్లి జైల్లో విచారణ ఖైదీలుగా ఉన్న వీరిని పోలీసులు మంగళవారం కోర్టులో హాజరు పరిచారు. కాగా పేలుళ్ళ సూత్రధారి రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నాడు.. అతడు పాకిస్తాన్లో తల దాచుకుని ఉండవచ్చునని భావిస్తున్నారు.  

 
 
Related News