India / Crime
బ్లూవేల్ గేమ్ మరొకరి ప్రాణం తీసింది
68 days ago

బ్లూవేల్ గేమ్ మరొకరి ప్రాణం తీసింది. పశ్చిమ బెంగాల్ మిడ్నపూర్ జిల్లాలో పదో తరగతి చదువుతున్న అంకన్ అనే విద్యార్థి ఈ గేమ్ ఆడుతూ ముఖానికి పాలిథిన్ కవర్ చుట్టుకుని ఊపిరి ఆడకుండా చేసుకుని మరణించాడు. స్కూలు నుంచి వచ్చిన తరువాత.. స్నానం చేసి వస్తానని చెప్పి వెళ్ళిన అంకన్.. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో అతని తలిదండ్రులు బాత్‌రూమ్‌లో చూడగా అతని డెడ్ బాడీ కనిపించింది. అతడిని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించాడని డాక్టర్లు తెలిపారు. చివరిసారిగా అంకన్ ఈ గేమ్ ఆడుతూ కనిపించాడని సమాచారం.

మూడు రోజుల క్రితం మహారాష్ట్రలోని రెండు ప్రాంతాల్లో ఇద్దరు స్టూడెంట్స్ ఈ గేమ్ ఆడి సూసైడ్ చేసుకునేందుకు యత్నించగా వారి బంధువులు కాపాడారు. గతనెలలో ముంబైలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్ధి ఇదే ఆట ఆడుతూ ఎత్తైన భవనం నుంచి కిందికి దూకి మృతి చెందాడు. 50 దశలు దాటిన తరువాత ఆత్మహత్య చేసుకోవాలని ఈ బ్లూవేల్ గేమ్‌లో ఉంటుందట.

 

Read Also

 
Related News
JournalistDiary