AP and TS / Entertainment
చిరంజీవి మూవీలో ఈగ విలన్ సుదీప్
74 days ago

చిరంజీవి- సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌లో రానున్న ఓ ఫిల్మ్ రానుంది. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాలవాడ
నరసింహరెడ్డి లైఫ్ స్టోరీ ఆధారంగా తెర‌కెక్కనుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఇందులో ఎక్కువభాగం షూటింగ్ ఉత్తర భారత‌దేశంలో జరుపుకోనున్నట్టు టాక్. మరో కొత్త విషయం ఏంటంటే.. ఇందులో ఈగ మూవీలో విల‌న్‌గా న‌టించిన సుదీప్ కీల‌క‌పాత్ర చేయ‌బోతున్నాడ‌ని సమాచారం.

 

ఆ మ‌ధ్య ఉపేంద్రని కూడా సెల‌క్ట్ చేసిన‌ట్టు వార్తలొచ్చిన సంగ‌తి తెలిసిందే! మరోవైపు నటీనటులు ఎక్కువమంది వుండడంతో ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి పేరు టైటిల్ పెట్టడం కంటే.. ఓవరాల్‌గా ‘మ‌హ‌వీర’ టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలనే విషయంలో మేకర్స్ ఓ క్లారిటీకి రాలేదు. ఐశ్వర్యరాయ్, అనుష్క, నయనతారలలో ఒకరిని తీసుకుంటారనే ప్రచారం మాత్రం జరుగుతుంది. ఇక బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషించ‌వచ్చునంటూ ప్రచారం సాగుతోంది.

 

Read Also

 
Related News
JournalistDiary