India / Crime
చంపేస్తామంటూ నటుడికి...
230 days ago

నటుడు ఆనంద్‌రాజ్ వార్తల్లోకి వచ్చేశాడు. తనను చంపేస్తామంటూ కొంతమంది వ్యక్తులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారట. ఈ విషయమై ఆయన చెన్నైలోని నుంగంబాకం పోలీసు‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇటు చెన్నైలోని ఆనంద్‌రాజ్‌ ఇంటికి సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు.దీంతో ఆనంద్‌రాజ్ వ్యవహారం తమిళనాడులో హాట్ టాపిక్ అయ్యింది.

గడిచిన 12 ఏళ్లుగా అన్నాడీఎంకెలోవున్న ఆనంద్‌రాజ్, జయలలితకు మంచి విధేయడిగా పేరు సంపాదించుకున్నాడు. ఆమె మరణం తర్వాత పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. ప్రస్తుతం పరిస్థితులు బాగోలేనందున పార్టీ నుంచి వైదొలగుతున్నానని ఇటీవల ఆనంద్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే! 

 
 
Related News