India / Politics
అమిత్ షాతో ఉపేంద్ర భేటీ!
10 days ago

సౌత్‌ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటుడు ఉపేంద్ర. కన్నడతోపాటు తెలుగు, తమిళంలోనూ నటించాడు.. అభిమానులను సంపాదించుకున్నాడు. తనకున్న ఇమేజ్‌‌తో రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని భావిస్తున్నాడు. త్వరలో కర్ణాటక శాసనసభకు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వేగంగా పావులు కదుపుతున్నాడు.

 

ఇందులోభాగంగా శనివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఉపేంద్ర భేటీ కానున్నాడు. షా తో సమావేశం తర్వాతే తన ఫ్యూచర్ ప్లాన్ ఏంటో మనసులోని మాటను ఆయన మీడియాకి వెల్లడించనున్నట్లు సమాచారం. ఇటీవలకాలంలో రాజకీయ, అవినీతి, సామాజిక అంశాలపై ట్విటర్ ద్వారా తన ఒపీనియన్‌‌ని బయటపెడుతున్నాడు ఈ నటుడు.

 
 
Related News