India / Politics
ఇంతకీ.. మ్యాటరేంటి?
220 days ago

2019 పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పటినుంచే తమిళనాడులో కమలనాధులు పావులు కదుపుతున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. శశికళను పైకి సపోర్ట్ చేసినట్టు కనిపిస్తూనే, లోలోపల ఆమెని తమవైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. వెంకయ్యనాయుడుకు తమిళనాడు రాజకీయాల పట్ల మంచి అవగాహన వుండడం, అన్నాడీఎంకె వర్గంలో కొంతమంది బీజేపీ సానుభూతిపరులు వుండడంతో కమలనాథులకు కలిసొచ్చే అంశంగా పరిగణిస్తున్నారు. చెన్నైలోని ఆర్కే‌నగర్ నియోజకవర్గం నుంచి శశికళ పోటీ చేయడానికి సిద్ధంగావున్న నేపథ్యంలో పరోక్షంగా ఆమెకు బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు రెడీ అయినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. 

మరోవైపు జిల్లా అధ్యక్షుల సమావేశంలో అన్నాడీఎంకేని ఎవరూ విచ్ఛిన్నం చేయలేరని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ స్పష్టంచేయడం వెనుక కారణమేంటి? అంటూ చర్చించు కోవడం నేతల వంతైంది. అక్రమాస్తుల కేసులో జయలలితతోపాటు ఆమె కూడా జైలుకి వెళ్లారు. ఐతే, కొద్దిరోజులుగా తమిళనాడులో జరుగుతున్న పరిణామాలు కూడా ఇందుకు ఊతమిచ్చేలా వున్నాయి. పెరా నిబంధనలను ఉల్లంఘన కేసులో అన్నాడీఎంకే మాజీమంత్రి, శశికళ మేనళ్లుడు టీటీవీడీ దినకరన్కు ఈడీ రూ.28 కోట్ల జరిమానా విధించింది. దీనికితోడు తమిళనాడు మాజీ ప్రభుత్వ కార్యదర్శి రాంమోహన్‌రావు ఇంట్లో ఐటీ దాడులు కూడా ఇందులోభాగమేనన్నది ఆ పార్టీలోని కొందరు నేతలంటున్నమాట. 

 
 
Related News