World / Health
నిన్న నూడిల్స్.. నేడు పాస్తా!
694 days ago

మ్యాగీ నూడిల్స్ వివాదం నుండి ఇప్పుడిప్పుడే తేరుకుని మార్కెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చేసింది. వెంటనే నెస్లేకు సంబంధించిన మరో ఉత్పత్తిపై దుమారం మొదలైంది. యూపీలోని ఫుడ్ లాబొరేటరీ సంస్థ నిర్వహించిన శాంపిల్ టెస్ట్లో నెస్లే పాస్తా విఫలమైనట్టు తేలింది. ఇందులో మోతాదుకు మించిన సీసం పరిమాణం ఉన్నట్లు తేలిందని లాబొరేటరీ అధికారి అరవింద్ యాదవ్ తెలిపారు.

జూన్ 10న నెస్లే డిస్ర్టిబ్యూటర్ నుంచి ఈ ప్రాడెక్ట్‌కు సంబంధించి శాంపిల్స్‌ను టెస్టింగ్ కోసం ల్యాబ్‌కు పంపారు అధికారులు. సాధారణంగా సీసం మోతాదు 2.5 పీపీఎంకు మించరాదు. అయితే పాస్తా శాంపిల్స్లో 6 పీపీఎం ఉన్నట్లుగా తేలింది. ఈ రిపోర్టు ప్రకారం నెస్లే పాస్తా ప్రొడక్ట్ను హానికరమైన అహార పదార్థాల జాబితాలో చేర్చారు. తమ పరిశీలనలో తేలిన ఫలితాలను లక్నో లాబొరేటరీకి పంపిన అధికారులు దీనిపై కోర్టులో కేసు నమోదు చేయడానికి అనుమతులు కోరినట్టు సమాచారం. 

 

Read Also

 
Related News
JournalistDiary