World / Crime
ఎయిర్ పోర్టులో టెర్రర్
110 days ago

అమెరికాలోని ఫ్లోరిడా ఎయిర్ పోర్టులో ఓ దుండగుడు రెచ్చిపోయాడు. తోటి ప్రయాణీకులతో గొడవపడి వాళ్లపై విచ్చలవిడిగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ దాడిలో ఐదుగురు చనిపోగా, 8మందికి తీవ్ర గాయాలయ్యాయి.

ఎయిర్ పోర్ట్ రెండో టెర్మినల్ లగేజీ చెకింగ్ ప్రాంతంలో ఈ దారుణం జరిగినట్టు తెలుస్తోంది. దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అధికారులు ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్డేల్ ఎయిర్ పోర్టును మూసివేశారు.

గాయపడ్డవారిని హుటాహుటీన ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు. అయితే, దుండగుడు ఎందుకిలా ప్రవర్తించాడన్నదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

 

 
 
 
Related News

JournalistDiary