AP / Politics
బెజవాడ‌కు ఐశ్వర్య ఎందుకొచ్చింది?
168 days ago

బెజవాడ ఐశ్వర్య ఎందుకొచ్చింది? సూపర్‌స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ధనుష్ కాసేపు హల్‌చల్ చేసింది. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నిర్వహిస్తున్న స్వర్ణభారతి ట్రస్ట్ సెలబ్రేషన్స్‌లో పాల్గొనడానికి ఆదివారం అక్కడికి వచ్చిన ఐశ్వర్య, అందర్నీ ఆశ్చర్యపరిచింది. మానాన్న గొప్ప యాక్టరేకానీ నేను కాదని, తాను సినిమా డైరెక్షన్ ఫీల్డ్‌లోకి ఎంటరయ్యానని తెలిపింది. పనిలోపనిగా స్వర్ణభారతి మేనేజ్‌మెంట్ ట్రస్టీ అయిన దీపాను ఆకాశానికెత్తేసింది. మేమిద్దరం మానాన్నలున్న ఫీల్డ్‌లో కాకుండా వేరే కెరీర్స్‌లో కొనసాగుతున్నాం.. దీప కూడా వాళ్ల నాన్న మాదిరిగా రాజకీయాల్లోకి కాకుండాసమాజ సేవలో అంకితం కావడం శుభపరిణామం అంటూ చెప్పుకొచ్చింది. ఇంతకీ అసలు విషయం ఏంటి? వెంకయ్యనాయుడు ఆమెను సాదరంగా ఆహ్వానించడం, ఆమె గురించి ఆడియన్స్‌కు ఇంట్రడ్యూస్ చేయడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. అదలావుంచితే ఆమె మాట్లాడకముందే వేదిక మీదనున్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు జడ్జి చలమేశ్వర్‌లతో మాట్లాడడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవల తమిళనాడులో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, జయలలిత మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాలు బీజేపీలో కొత్త ఆశల్ని రేకెత్తించాయి. 

జయలలిత మరణాంతరం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో బీజేపీ తన పాత్రను మరింత మెరుగుపర్చుకోవాలని, ఇటీవల వెంకయ్యనాయుడు పేర్కొన్న విషయం విధితమే! రాజకీయంగా బీజేపీకి అక్కడ నాయకత్వం లోపం మొదటినుంచీ కనిపిస్తున్నదే! ఈ నేపథ్యంలో రజనీ కుమార్తెతో తమకున్న పూర్వ సంబంధాన్ని ఆధారంగా చేసుకుని కొత్త రాజకీయ ఆలోచన ఏమైనా వెంకయ్య చేస్తున్నారా అంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి. ఐతే ఇదంతా కేవలం ఊహాగానాలు మాత్రమేనని రజనీ కుటుంబం మొదటినుంచి రాజకీయాలకు దూరంగా వుంటుందని, ఆయన కూతురు ఐశ్వర్య స్వర్ణభారతి వారికోత్సవం కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానిస్తే వచ్చానని మాత్రమే వెంకయ్య వర్గీయులు చెప్పుకొచ్చారు. మొత్తమ్మీద ఆదివారంనాడు ఐశ్వర్య రాక బెజవాడలో కొద్దిసేపు హల్‌చల్‌గా మారింది.  

 

 
 
 
Related News

JournalistDiary