World / Health
తాగితే క్యాన్సర్ గ్యారంటీ!
242 days ago

మందుబాబులకు కిక్కు దిగిపోయే వార్త. ఆ.. ఏం కాదులెద్దూ.. రెండుమూడు పెగ్గులని సర్దుకుని తాగే మందు బాబులయినా, అడపాదడపా నాలుగు చుక్కలు లాగించే వాళ్లకైనా క్యాన్సర్ కాటు తప్పదంటున్నాయి తాజా నివేదికలు. ది అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ అండ్ ది ఇంటర్నేషనల్ ఏజన్సీ- వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్, మరికొన్ని సంస్థలు పదేళ్ళపాటు జరిపిన పరిశోధనల్లో ఆల్కహాల్ క్యాన్సర్‌కు ఎలా కారణమౌతుందనే విషయాలు తెలిపాయి. దీనిప్రకారం ప్రపంచం‌లో సంభవించే మరణాల్లో 6 శాతం ఆల్కహాల్‌కు సంబంధించినవేనని తేలింది.

న్యూజిలాండ్ యూనివర్సిటీ ఆఫ్ ఒటాగోకు చెందిన ఎపిడిమియాలజీ ప్రొఫెసర్  జెన్నీ‌కార్నర్ రీసెర్చ్ ప్రకారం 2012లో సుమారు 5 లక్షలమంది ఆల్కహాల్ వాడకంవల్ల క్యాన్సర్ బారినపడి మరణించిన వారేనని తేలింది. అల్కహాల్ తీసుకోవడంవల్ల శరీరంలోని కొన్ని అవయవాలకు క్యాన్సర్‌ వచ్చే ఛాన్స్ ఉందట. ముఖ్యంగా లివర్, కొలోన్, ఈసోఫేగస్, మహిళల వక్షోజ ప్రాంతాలతోపాటు ప్రొస్టేట్, పాంక్రియాసిస్, చర్మానికి కూడా క్యాన్సర్ సోకే ప్రమాదముందట. రోజూ అతిగా ఆల్కహాల్ తీసుకునేవారిలో సెలివరీ ఎసిటాల్ డిహైడ్ లెవెల్స్ ఎక్కువగా ఉండటంతో క్యాన్సర్ సోకడానికి కారణమంటున్నా యి నివేదికలు. సో.. నాలుగు కాలాలపాటు బతికి బట్టకట్టాలంటే మందు మాటెత్తకపోవడమే మంచిదంటున్నాయి నివేదికలు. 

 

 

 

 
 
 
Related News

JournalistDiary