World / Health
ఇకపై హెచ్‌ఐవీకి చెక్!
528 days ago

మందు (ఆల్కహాల్) మానేందుకు ఉపయోగపడే మెడిసిన్.. భయకరమైన హెచ్‌ఐవీ వైరస్‌ను కూడా నిర్మూలిస్తుందట. ఆశ్చర్యంగా వుందికదూ! పైగా ఈ ఆల్కహాలిక్ ప్రివెంటివ్ డ్రగ్‌లో మరో విశేషం కూడా వుంది. ఇది తీసుకుంటే హెచ్ఐవీ వైరస్‌ను ఒక్కసారిగా రీయాక్టివేట్ చేసి చటుక్కున దాన్ని అంతం చేస్తుందని రీసెర్చర్లు చెబుతున్నారు. ‘డై సల్ఫిరామ్’ అనే ఈ మెడిసన్ .. మానవ వ్యాధి నిరోధక సెల్స్‌లో వైరస్ ఎక్కడుందో ఖచ్చితంగా తెలుసుకుని దాన్ని నశింపజేస్తుందని అంటున్నారు. ఎయిడ్స్ వ్యాధికి చికిత్స పొందుతున్న రోగుల్లో హెచ్ఐవీ వైరస్ కొన్ని కణాల్లో ‘దాగి’ వుంటుందని ఐతే, చికిత్స నిలిపివేయగానే అది మళ్లీ యాక్టివేట్ అవుతుందంటున్నారు.

ట్రీట్‌మెంట్ కు ఇది అవరోధంగా మారుతుంది గనుక ‘టార్గెట్’ని (వైరస్) ఛేదించాలంటే ఈ మందు చక్కగా పనిచేస్తుందని కనుగొన్నారు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ కూడా వుండవట. మెల్‌బోర్న్ యూనివర్సిటీకి చెందిన షారోన్ లెవిన్ అనే ప్రొఫెసర్ 30 మంది ఎయిడ్స్ రోగులకు పరీక్షలు చేసి దీన్ని నిర్ధారించాడు. యాంటీ రెట్రోవైరల్ ట్రీట్‌మెంట్ ఇస్తూ.. ఈ మందు డోసులను పెంచుతూ 3 రోజులపాటు పరీక్షలు నిర్వహించాడు. ప్రయోగాత్మకంగా జరిగిన ఈ టెస్టుల్లో  డై సల్ఫిరామ్ టాక్సిన్ కాదని పైగా సేఫ్ మెడిసిన్ అని ఆయన ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడు. హెచ్ ఐవీ వైరస్‌ను యాక్టివేట్ చేసి దాన్ని అంతం చేయడమన్నది ఈ ప్రయోగాల లక్ష్యమన్నాడు. హెచ్ఐవీ సంబంధిత వ్యాధులతో వాల్డ్ వైడ్‌గా సుమారు 34 మిలియన్ల మంది మరణిస్తున్నారని ఓ అంచనా! 

 

 
 
 
Related News

JournalistDiary