AP and TS / Politics
ముగ్గురు నిర్మాతలతో కలిసి..
68 days ago

‘దువ్వాడ జగన్నాథమ్’ రిలీజ్‌కి సిద్ధంకావడంతో కొత్త ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టాడు అల్లుఅర్జున్. వక్కంతం వంశీ డైరెక్షన్‌లో
చేయనున్న సినిమా పూజా కార్యక్రమాలు బుధవారం ఉదయం హైదరాబాద్‌లో జరిగాయి. దీనికి ‘నాపేరు సూర్య’ టైటిల్
కాగా, ‘నా ఇల్లు ఇండియా’ అనే ట్యాగ్ లైన్ పెట్టేశారు.

ప్రస్తుతం డీజే ప్రమోషన్‌తో బిజీగావున్న బన్నీ, జూన్ మూడోవారం నుంచి ఈ ప్రాజెక్టులో జాయిన్ కానున్నాడు. ఈ మూవీని లగడపాటి శ్రీధర్, బన్నీవాసు, నాగబాబు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రాన్ని వచ్చేఏడాది ఉగాదికి రిలీజ్ చేయాలన్నది మేకర్స్ థాట్.

 

 

 

 
 
Related News