India / Politics
కర్ణాటకలో షా వ్యూహం, గాలి బ్రదర్స్‌‌కి గ్రీన్‌సిగ్నల్!
69 days ago

కర్ణాటకలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలైంది. వచ్చే ఏడాది కర్ణాటక శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కమల దళపతి అమిత్‌షా బెంగుళూరులో మూడురోజుల మకాం పెట్టేశారు. ఢిల్లీ నుంచి బెంగుళూరుకి శనివారం ఉదయం
చేరుకున్న ఆయనకు కేంద్రమంత్రులు, మాజీ సీఎం యెడ్యూరప్ప, పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

తొలుత బీజేపీ ఎమ్మెల్యేలతో మంతనాలు సాగించనున్నారు. ఆ తర్వాత పార్టీ వీక్‌గావున్న ప్రాంతాలపై ప్రధానంగా చర్చించ నున్నారు. వీలైతే ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా పార్టీని బలోపేతం చేయాలని ప్లాన్ చేసినట్టు సమాచారం. పనిలోపనిగా షా సంకేతాలతో గాలి బ్రదర్స్ యాక్టివ్‌గా పనిచేయవచ్చని పార్టీ నేతలు భావిస్తున్నారు. 

మరోవైపు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవమున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని ఎదుర్కోవడం కత్తిమీద సామేనని అంటున్నారు. ఇప్పటికే ఆ రాష్ర్టంలోని వివాదాస్పద అంశాలను మెల్లమెల్లగా కదుపుతూ తనదైన రాజకీయాన్ని షురూ చేశారు సీఎం సిద్ధు. కర్ణాటక‌కు సొంత జెండా వుండాలని, కర్ణాటకలో ఉద్యోగం కావాలనుకునేవాళ్లు కచ్చితంగా కన్నడ రావాల్సిందేనని, ఇప్పటికే ప్రభుత్వం వివిధ శాఖలకు నోటీసులు జారీ చేసిన విషయం తెల్సిందే! ఈ నేపథ్యంలో షా ప్రతివ్యూహం ఏమిటన్నది సస్పెన్స్‌గా మారింది.

 

Read Also

 
Related News
JournalistDiary