India / Entertainment
షూటింగ్‌లో అమితాబ్‌కి గాయం
69 days ago

‘త‌గ్స్ ఆఫ్ హిందోస్తాన్‌’ మూవీ షూటింగ్‌లో నటుడు అమితాబ్ గాయ‌ప‌డ్డాడు. చిత్రీకరణ స‌మ‌యంలో బిగ్‌బీకి ప‌క్క
టెముకు విరిగిన‌ట్లు టాక్. ఐనా, ఏమీ ప‌ట్టించుకోకుండానే షూటింగ్ అలాగే కొన‌సాగించాడట. ముంబైకి వ‌చ్చిన త‌ర్వాత
డాక్టర్ల ఆదేశాల మేరకు ఎంఆర్ఐ స్కానింగ్ చేయడంతో ప‌క్క టెముకు విరిగినట్టు తేలింది.

ప్రస్తుతం ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. కొద్దిరోజులపాటు రెస్ట్ ఇవ్వాలని వైద్యులు సలహా ఇచ్చారు. ఇక మూవీ విషయానికొస్తే..  ఆమీర్‌ఖాన్, కత్రినాకైఫ్, జాకీ ష్రాఫ్ వంటి  నటీనటులు  పనిచేస్తున్న ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది దీపావ‌ళికి రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ఆలోచన. విజ‌య్ కృష్ణా ఆచార్య దీనికి డైర‌క్టర్.

 

Read Also

 
Related News
JournalistDiary