AP and TS / Entertainment
చిరంజీవితో రవిప్రకాష్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
259 days ago

టీవీ9 సీఈవో రవిప్రకాష్‌కు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో చాలా క్లారిటీతో సమాధానాలిచ్చారు చిరంజీవి. సుధీర్ఘంగా సాగిన ఇంటర్వ్యూలో ఆశ్చర్యకరమైన సమాధానాలు లేనప్పటికీ వివాదాస్పదమైన అనేక విషయాలపై అడిగిన ప్రశ్నలకు చిరంజీవి సూటిగా సమాధానాలిచ్చారు.

ప్రీరిలీజ్ ఫంక్షన్లో నాగబాబు, రామ్ గోపాల్ వర్మ, యండమూరిపై చేసిన వ్యాఖ్యలు, సినిమా షూటింగ్ సమయంలో వివి వినాయక్ పనికి అడ్డుతగిలారన్న వాటిపై సంధించిన ప్రశ్నలకు.. విజయవాడలో ఫంక్షన్ కు అనుమతి నిరాకరించిన అంశానికి, పవన్ కళ్యాణ్ మీద సంధించిన ప్రశ్నలకు చిరంజీవి చాలా కూల్ గా సమాధానాలు చెప్పడం విశేషం.

ఎవరిమీదా తీవ్రమైన విమర్శలుగాని, వ్యాఖ్యలుగాని చేయకుండా,  తన సహజధోరణికి భిన్నంగా.. మాటలకు తడుముకోకుండా.. తడబడకుండా ప్రశాంత వదనంతో ఎలాంటి ఆవేశానికి, ఉద్వేగాలకు లోనుకాకుండా ఇంటర్వ్యూని రక్తి కట్టించాడు చిరంజీవి. అటు ప్రజారాజ్యం, యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాల మీద, కాపురిజర్వేషన్ల అంశంమీదా అడిగిన ప్రశ్నలకు కూడా ఎలాంటి తొత్తరపాటు లేకుండా చిరు సమాధానాలిచ్చారు. 



 

Read Also

 
 
Related News
JournalistDiary