AP and TS / Entertainment
నాకంత సమయం లేదు- అనసూయ
88 days ago

ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ షోకి వైల్డ్‌‌కార్డ్‌ ఎంట్రీ ద్వారా యాంకర్ అన‌సూయ వస్తున్న వార్తలకు ఫుల్‌స్టాప్ పడింది. దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చింది. సినిమాలు, బుల్లి తెర‌షోలతో ప్రస్తుతం తాను బిజీగా వున్నానని ట్విట్టర్‌లో రాసుకొచ్చింది. డేట్స్ ఖాళీగా లేవని, బిగ్‌బాస్‌లో తాను ఎంట‌ర్ అవుతున్నానంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పేసింది. ఇప్పుడు టీవీ షోలు చేస్తూనే, మరోవైపు ‘రంగ‌స్థలం 1985’ చిత్రంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇవికాకుండా ఈ అమ్మడి చేతిలో మరికొన్ని ప్రాజెక్టులున్నాయి.

 

Read Also

 
Related News
JournalistDiary