AP and TS / Entertainment
ఆంధ్రా అమితాబ్
8 days ago

మనిషిని పోలిన మనుష్యులు ఉంటారన్నది నానుడి. దీనిని నిజం చేస్తూ అచ్చం 'బిగ్ బి' అమితాబ్ బచ్చన్ ను పోలిన వ్యక్తి మన తెలుగువాడే ఉన్నాడు. ‘ఆంధ్రా అమితాబ్’గా అందరూ ముద్దుగా పిలుచుకునే ఇతని పేరు గోపి(50). ప్రస్తుతం గోపి ఫ్రీలాన్స్ కెమెరామ్యాన్‌గా పనిచేస్తున్న గోపీ, ఇప్పటివరకూ అనేక ప్రముఖ ప్రాజెక్ట్ లకు తన కెమెరా పనితనాన్ని నిరూపించుకున్నాడు.

6 అడుగుల ఎత్తుండే గోపి.. అమితాబ్ నటించిన ‘కూలీ’ సినిమా చూసిన తరువాత అతని అభిమానిగా మారిపోయానని చెబుతుంటారు. ముఖకవలికలు, ఒడ్డు పొడుగులో అచ్చం అమితాబ్ లా ఉండే గోపీ, కట్టుబొట్టు, వేషధారణలో అమితాబ్‌ను అనుకరించడం ఇష్టమని చెబుతుంటారు.

 

Read Also

 
Related News
JournalistDiary