India / Entertainment
చెర్రీ ట్రాప్‌‌లో అనుష్క!
65 days ago

150 కోట్ల బడ్జెట్ తో భారీగా ప్లాన్ చేసిన 151వ మెగా మూవీ కోసం గ్రౌండ్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు. సీమ పోరాట యోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రను అడాప్ట్ చేసుకుని కథయితే రాసుకున్నారు కానీ.. కాస్టింగ్ విషయంలో మాత్రం ఇంకా లెక్క కుదిరినట్లు లేదు. డైరెక్టర్ సురేందర్ రెడ్డితో పాటు మెగా క్యాంప్ మొత్తం ఈ విషయం మీదే సీరియస్ సిట్టింగ్స్ లో ఉండిపోయింది. ముఖ్యంగా హీరోయిన్ విషయంలోనే భీకరమైన కన్ ఫ్యూజన్ !

వయసు, ఇమేజ్, పర్సనాలిటీ రీత్యా చిరు పక్కన స్వీటీ అనుష్క అయితేనే బెటరన్నది మొదట్నుంచీ వున్న అబిప్రాయం. అందుకే.. ఖైదీ నంబర్ 150లో హీరోయిన్ పోస్ట్ కోసం ప్రపోజల్ పెట్టింది కొణిదెల ప్రొడక్షన్స్. అయితే.. అప్పట్లో బాహుబలితో కమిటై వున్నానంటూ ఈజీగా తప్పించుకుంది బొమ్మాళి. ఇప్పుడు మళ్ళీ నువ్వే కావాలంటూ రామ్ చరణ్ సిగ్నల్స్ పంపించాట్ట. ప్రస్తుతానికి కాల్షీట్లు ఎగ్గొట్టడానికి అనుష్క దగ్గర సరైన కారణం లేదు. మరోవైపు.. మెగాస్టార్ తో చేసే ఛాన్స్ ను వదులుకోవాలని ఏ అమ్మడూ అనుకోదు కూడా. పైగా స్టాలిన్ మూవీలో మెగాస్టార్ పక్కన చేసిన అనుభవం స్వీటీ ఖాతాలో వుంది. మరి.. చిరూ పక్కన మళ్ళీ చెలరేగిపోడానికి అనుష్క రెడీ అయినట్లేనా? ఆమెకున్న మల్టీ టాలెంట్ ఒక పార్శ్వమైతే.. మల్టీ లాంగ్వేజెస్ లో అనుష్క సంపాదించుకున్న మార్కెట్ వ్యాల్యూను కూడా ఎన్ క్యాష్  చేసుకోవాలన్నది మెగా శిబిరం ఆలోచన.

ఇంతకుముందు.. చిరంజీవి ఉయ్యాలవాడకు ఐశ్వర్య రాయ్ ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్లు వార్తలొచ్చాయి. ఆ మధ్య విద్యాబాలన్ మీద కూడా ఓ కన్నేసి ఉంచింది మెగా యూనిట్. అయితే.. చారిత్రక నేపథ్యమున్న సినిమాల్లో చేసిన అనుభవం అనుష్కకే ఎక్కువ కనుక.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పక్కన ఆమెనే ఫిక్స్ చేయాలని ప్రొడ్యూసర్ చరణ్ పట్టుదలతో వున్నాడు. మరి.. స్వీటీ ఏమంటుందో..?

 
 
Related News