AP / Politics
లంకలో చంద్రబాబు.. ఏం జరిగిందంటే
223 days ago

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రెండురోజుల శ్రీలంక టూర్ ముగిసింది. ఇంతకీ పర్యటనలో ఏం జరిగింది? వున్నట్లుండి చంద్రబాబు టీం శ్రీలంక ఎందుకెళ్లినట్టు? రాజధాని అమరావతికి శ్రీలంక తనవంతు సాయం అందిస్తుందని పాలకులు చెబుతున్న మాట. ఇప్పటికే సింగపూర్ తయారు చేసిన మాస్టర్ ప్లాన్‌ని పరిశీలించి, సూచనలు చేస్తుందని అంటున్నారు. వున్నట్లుండి శ్రీలంక తెరపైకి ఎలా వచ్చిందంటూ చర్చించుకోవడం ప్రత్యర్థి పార్టీల వంతైంది. 

పర్యాటక - ఆతిథ్య, గృహ నిర్మాణ రంగాల్లో భాగస్వామ్యానికి పశ్చిమ ప్రావిన్స్‌ అభివృద్ధి మంత్రిత్వశాఖ ఏపీతో సంసిద్ధత వ్యక్తంచేసింది. శనివారం రాత్రి ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన ఆ దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ఆదివారం ఆయనతో కలసి కీలకమైన సదస్సులో పాల్గొన్నారు. కొలంబో సహా పశ్చిమప్రావిన్సులో అక్కడి ప్రభుత్వం మెగాపోలీస్‌ ప్రాజెక్టుగా అభివృద్ధి చేస్తోంది. ఆ దేశ పారిశ్రామిక ఉత్పత్తి విలువలో 73 శాతం ఆ ప్రావిన్స్ నుంచే వస్తుందట.

ఆ ప్రాజెక్టు తీరుతెన్నుల్ని క్షుణ్నంగా పరిశీలించిన బాబు, పట్టణాభివృద్ధి ప్రణాళిక, స్మార్ట్‌ టెక్నాలజీ, కొలంబో మల్టీ మోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టం, ఎయిర్‌ పోర్టులు - పోర్టుల అభివృద్ధి, సరస్సులు తదితర అంశాలపై చర్చించారు. ఏపీలోనూ తీర ప్రాంతం ఎక్కవగా వుంది. అక్కడ అభివృద్ధిని కళ్లరా తిలకించిన సీఎం చంద్రబాబు మదిలో ఏముందోగానీ కొన్నాళ్లకుగానీ తెలియదంటున్నారు. 

 
 
Related News