World / Politics
భారత్‌లో రాయబారిగా ఎన్నారై?
168 days ago

అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్‌ట్రంప్ ప్రమాణ స్వీకారానికి సమయం దగ్గరపడుతుండడంతో మంత్రిపదవుల అంశం ఓ కొలిక్కివస్తోంది. తాజాగా భారత్‌లో యూఎస్ రాయబారిగా ప్రవాస భారతీయుడు యాష్లె టెల్లిస్‌ని నియమించే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ముంబైలో పుట్టి పెరిగిన యాష్లెని రాయబారిగా నియమించడానికి ట్రంప్‌ టీమ్ అనుకూలంగా వున్నట్లు అమెరికా పత్రికలు పేర్కొన్నాయి.

55 ఏళ్ల టెల్లిస్‌, భారత్‌- అమెరికా దేశాల మధ్య సంబంధాల విషయంలో కీలక పాత్ర పోషించారు. గతంలో అమెరికా రాయబారికి సీనియర్‌ సలహాదారుగా కూడా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అధ్యక్షుడికి ప్రత్యేక సహాయకుడిగా, సౌత్‌వెస్ట్‌ ఏషియా డైరెక్టర్‌ ఫర్‌ స్ట్రాటజిక్‌ ప్లానింగ్‌లో సీనియర్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ముంబై యూనివర్శిటీ నుంచి పట్టా పొందిన ఆయన, చికాగో విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ చేశారు.

 

 
 
 
Related News

JournalistDiary