World / Health
రోగం కుదిరే టైమొచ్చింది!
378 days ago

అవును.. ప్రజల్ని పట్టిపీడిస్తోన్న డెంగ్యూ మహమ్మారి రోగం కుదిరే టైమొచ్చిందంటున్నారు శాస్త్రవేత్తలు. డెంగ్యూ వ్యాధి నివారణకు ఆయుర్వేద మందు త్వరలోనే మార్కెట్లోకి రాబోతుందని చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న మందులేవీ ఈ మహమ్మారిని పూర్తిగా సమర్థవంతంగా అరికట్టలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో నడుంబిగించిన భారత శాస్త్రవేత్తల బృందం ఈ వ్యాధి నివారణకు మందు కనిపెట్టింది. ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ లో ఉన్న ఈ డ్రగ్ రెండేళ్లలో భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. భారత ప్రభుత్వ అధీనంలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్  జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ శాస్త్రవేత్తలు ఈ విజయం సాధించారు.

స్థానికంగా లభించే 'లఘు పట్టా' అని పిలిచే మొక్క నుంచే ఈ మెడిసిన్ తయారు చేస్తున్నారు. దీని శాస్త్రీయనామం 'సిసమ్పిలాస్ పేరీరా'. కాగా, డెంగ్యూ వ్యాధి భారిన పడ్డ వారి మరణాలు ఆగడంలేదు. డెంగ్యూ అనే దోమకాటు వల్ల వచ్చే ఈ వ్యాధి భారిన పడి రాజధాని ఢిల్లీలోనే గతేడాది 60మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య  99,913 గా ఉంది. ఈ పరిస్థితుల్లో డెంగ్యూ కోరల్లో చిక్కుకున్న వారికి ఇది వార్త శుభవార్తేనని చెప్పాలి. 

 

 
 
 
Related News

JournalistDiary