AP / Politics
నంద్యాలలో నువ్వా.. నేనా..?
68 days ago

నంద్యాల ఉపఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. రోడ్ షోలు, బహిరంగ సభలతో టీడీపీ, వైసీపీ హోరెత్తిస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్ ఆదివారం మళ్ళీ ఇక్కడ రోడ్ షో నిర్వహిస్తున్నారు. మరో రెండేళ్లలో జరగబోయే తుది సమరానికి ఈ ఉపఎన్నికను కౌంట్ డౌన్‌గా భావించిన ఈ రెండు పార్టీలూ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ మూడు సంవత్సరాల్లో ఏ ఉపఎన్నికలోనూ ఇంత గట్టి పోరాటం జరగలేదు.

అటు- మొట్టమొదటిసారిగా ఈ నియోజకవర్గంలో ఈవీఎంలలో వినియోగించే పేపర్ ఆడిట్ ట్రయల్ విధానంపై ఓటర్లలో ఆసక్తి పెరిగిపోతోంది. దీనివల్ల ఖచ్చితంగా ఎంతమంది ఓటర్లు, ఏ పార్టీకి ఓటు వేశారన్నది తెలిసిపోతుంది. ఎన్నికల అక్రమాలకు, అవకతవకలకు ఫుల్‌స్టాప్ పడనుందన్న వార్తలు పార్టీల్లో ఓవైపు ఆనందాన్ని, మరోవైపు గుబులుని రేపుతున్నాయి. రిగ్గింగ్‌కి ఏ మాత్రం అవకాశం లేదు.

 

Read Also

 
Related News
JournalistDiary