India / Politics
డాక్టర్లపై బీజేపీ ఎంపీ దాడి
226 days ago

ఏదోవిధంగా వార్తల్లోకి వస్తున్నారు బీజేపీ ఎంపీ అనంత్‌ కుమార్‌ హెగ్డె. తాజాగా కర్ణాటకలో ముగ్గురు డాక్టర్లను కొడుతూ  ఈసారి వార్తల్లోకి వచ్చేశారు. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీలో ఆయా సన్నివేశాలు రికార్డయినా, ఇంతవరకు పోలీసులు ఆయనపై ఎటువంటి కేసు నమోదు చేయలేదు. 

ఉత్తర కర్ణాటక నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన అనంత్‌కుమార్‌కు వివాదాలు కొత్తేమీకాదు. తీవ్ర అనారోగ్యంతోవున్న ఎంపీ తల్లికి సరైన ట్రీట్‌మెంట్ చికిత్స అందించలేదని ఆరోపిస్తూ మధుకేశ్వరజీవి, బాలచంద్ర, రాహుల్‌ మర్షకర్‌ అనే డాక్టర్లపై దాడి చేసినట్లు సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఇంత జరిగినా ఎంపీపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంపై సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

 
 
Related News