AP / Politics
రెండు లక్షల కోట్లు ఇచ్చాం..
9 days ago

ఏపీకి రూ.2.19 లక్షల కోట్లు ఇచ్చామని బీజేపీ నేత విష్ణువర్థన్ చెప్పారు. నిధులను ఏపీ ప్రభుత్వ ఖజానాకు జమ చేశామన్నారు. కావాలంటే, డీడీలు, బ్యాంక్‌ అకౌంట్లు చూపిస్తామని.. ఈ అంశంపై వైసీపీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ మళ్లీ భుజానకెత్తుకుంది. ఇవాళ అనంతపురంలో నిర్వహించిన యువభేరి కార్యక్రమంలో ఆపార్టీ అధ్యక్షుడు జగన్ ఈ అంశాన్నే ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ న్యూస్ ఛానల్ టీవీ9 నిర్వహించిన బిగ్ డిబేట్ లో ఈ అంశంపై ఆసక్తికరమైన చర్చజరిగింది.

 

Read Also

 
Related News
JournalistDiary