India / Entertainment
సీనియర్ హీరోతో ఇల్లీ రొమాన్స్
70 days ago

అజయ్‌ దేవ్‌గన్- ఇమ్రాన్ హ‌ష్మీ- ఇషాగుప్తా- ఇలియానా కాంబినేషన్‌లో రానున్న ఫిల్మ్ ‘బాద్‌షాహో’. చిత్రీకరణ పూర్తి కావడంతో ట్రైలర్‌ని యూనిట్ రిలీజ్ చేసింది. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు అప్పటి ఎమ‌ర్జెన్సీ ప‌రిస్థితుల‌ నేప‌థ్యంలో దీన్ని తెర‌కెక్కించాడు డైరెక్టర్ మిలాన్ లుత్రియా.

యాక్షన్ థ్రిల్లర్‌గా రానున్న ఈ చిత్రంలో గోవా బ్యూటీ ఇలియానా, ఇద్దరు హీరోలతో రొమాన్స్ చేసినట్టు యూనిట్ చెబుతున్నమాట. ఇక యాక్షన్ సన్నివేశాలకు కొదవలేదు. అభిమానులను ఆకట్టుకునే విధంగా వున్నాయి. ఏడేళ్ల తర్వాత అజయ్‌దేవ్‌గన్- ఇమ్రాన్‌హష్మీ- మిలన్‌లు మ‌రోసారి సంద‌డి చేయ‌బోతున్నారు. ప్రమోషన్ వేగంగా జరుగుతున్న ఈ ఫిల్మ్‌ని సెప్టెంబ‌ర్ 1న విడుద‌ల కానుంది. 

 

Read Also

 
Related News
JournalistDiary