India / Entertainment
బాహుబలి 2 మరో రికార్డ్
10 days ago

ప్రభాస్- రానా- అనుష్క- తమన్నా కాంబినేషన్‌లో వచ్చిన ‘బాహుబలి2’ మరో రికార్డ్ క్రియేట్ చేసింది. 1,050 సెంటర్లలో 50 రోజులను పూర్తి చేసుకుని సెంచరీ దిశగా అడుగులు వేస్తోంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇదో రికార్డ్‌. ఇప్పటివరకు ఏ బాలీవుడ్ హీరోకి ఈ ఫీట్ సాధ్యంకాలేదని అంటున్నారు సినీ విశ్లేషకులు. మూవీ రిలీజై వారం రోజులకే థియేటర్ల నుంచి తొలగిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో బాహుబలి 2.. వెయ్యికి పైగా థియేటర్స్‌లో ఆడడం విశేషంగా చెబుతున్నారు. ఈ ఫీట్‌ని అధిగమించడం ఇప్పటికే ఏ నటుడికీ సాధ్యంకాకపోవచ్చని అంటున్నారు. 

తెలుగు రాష్ర్టాల్లో 282 థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. 50 రోజుల సందర్భంగా యూనిట్ స్పెషల్ ఓ పోస్టర్‌ని రిలీజ్ చేసింది. ఇక కలెక్షన్ల విషయానికొస్తే.. ప్రపంచవ్యాప్తంగా 1684 కోట్ల రూపాయలు రాబట్టినట్టు ఓ ట్రేడ్ ఎనలిస్ట్ రాసుకొచ్చాడు. ఓవర్సీస్‌లో రూ. 310 కోట్లు వసూలు చేసింది. 

 

 
 
 
Related News

JournalistDiary