India / Entertainment
బాబారాందేవ్ కన్ను బాలీవుడ్‌పై
71 days ago

యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ ఇప్పుడు రూటు మార్చారు. స్వదేశీ నినాదంతో మార్కెట్‌లో దూసుకుపోతూ ఫారెన్
కంపెనీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. నరనరాల దేశభక్తిని పెంచుకున్న ఆయన, బాలీవుడ్‌లో అడుగుపెట్టనున్నారు.
త్వరలో ఆయన సిల్వర్‌స్ర్కీన్‌పై మెరవనున్నారు.

‘యే హై ఇండియా’ ఫిల్మ్‌లో స్పెషల్‌సాంగ్‌లో స‌య్యన్ స‌య్యన్ అనే సాంగ్‌లో రామ్‌దేవ్ దర్శనమీయనున్నారు. దేశభక్తి నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం కాన్సెప్ట్ విషయానికొస్తే, లండన్‌లో పుట్టిపెరిగిన ఓ యువకుడు, భారత్‌ని పేద దేశంలా భావిస్తాడు. ఐతే, అనంతరం భారత్‌లో వస్తున్న మార్పులు చూసి తన అభిప్రాయాన్ని ఎలా మార్చుకుంటాడు అనేది మెయిన్ స్టోరీ. దేశభక్తి నేపథ్యంలో మూవీ కావడంతో ఇందులో నటించడానికి బాబా అంగీకరించారని నిర్మాత చెబుతున్నమాట. ఆగ‌స్టు 18న ఈ చిత్రం దేశవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

 

Read Also

 
Related News
JournalistDiary