AP and TS / Entertainment
‘జయసింహ’ మొదలైంది
78 days ago

బాలకృష్ణ కొత్త ప్రాజెక్ట్ మొదలైంది. గురువారం ఉదయం రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల తర్వాత ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ బోయపాటి శ్రీను క్లాప్ కొట్టగా, కెఎస్ రవి కుమార్ దర్శకత్వం వహించాడు. దీనికి వర్కింగ్ టైటిల్ ‘జయసింహ’ అని పెట్టారు. ఇండస్ర్టీకి చెందిన చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. 

ఇక నయనతార, ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, అశుతోష్ రాణాలతోపాటు పంజాబ్‌కి చెందిన నటుడు ఇందులో విలన్‌గా కనిపించనున్నాడు. దీనికి తొలుత ‘రెడ్డిగారు’ అన్న టైటిల్‌ పెడుతున్నట్లు వార్తలు రాగా, ఇప్పుడు ‘జయసింహ’ అయితే సెంటిమెంట్ కలిసొస్తుందని అంటున్నారు. 

ఈనెలాఖరు వరకు రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరగనుంది. వచ్చేనెల నుంచి తమిళనాడులోని కుంభకోణం, వైజాగ్‌ల్లో షూటింగ్ జరగనుంది. అంతా అనుకున్నట్లయితే సంక్రాంతి బరిలోకి జయసింహను దించాలని  ఆలోచన చేస్తోంది యూనిట్.

 

Read Also

 
Related News
JournalistDiary