AP and TS / Entertainment
రైతు కథ అడ్డం తిరిగింది!
106 days ago

ప్రేక్షకుల జడ్జ్ మెంట్ మినహా బాలయ్య వందో సినిమా దాదాపుగా అయిపోయింది. ఇప్పుడాయన కాన్ సంట్రేషన్ మొత్తం 'వన్నాట్ వన్' మీదే ! సర్కార్-3 షూట్స్ జరిగే టైములో పనిగట్టుకుని ముంబై వెళ్లిన బాలకృష్ణ, తన 'రైతు' సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ కావాలంటూ బిగ్ బీ ముందు డిమాండ్ పెట్టారు. ఆ సమయంలో డైరెక్టర్ కృష్ణవంశీ కూడా పక్కనే వున్నారు. అక్కడితో సరి.

అమితాబ్ నుంచి ఇప్పటిదాకా ఎటువంటి రియాక్షన్ లేదు. తన కేమియో కోరికను బాలీవుడ్ సూపర్ స్టార్ ఒకే చెయ్యకపోతే 'రైతు'  ప్రాజెక్ట్ మొత్తాన్ని పెండింగ్ లో పెట్టేస్తానని బాలయ్య సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. బిగ్ బీ కాకపోతే మరెవ్వరూ ఆ రోల్ కి పనికిరారు కనుక బాలకృష్ణ ఇంత కఠిన నిర్ణయానికి రావడంలో తప్పు లేదని కూడా కృష్ణవంశీ యూనిట్ చెబుతోంది. కథ, రచన కూడా రెడీ అయిన 'రైతు' సినిమా అటకెక్కుతుందా.. లేక.. బాలయ్య మొండిగా పట్టుబట్టి అమితాబ్ ని ఒప్పిస్తారా ? చూడాలి. 

 

 
 
 
Related News

JournalistDiary