AP and TS / General
కెసిఆర్-బాలకృష్ణ ఫొటో గ్యాలరీ
44 days ago

చారిత్రక నేపథ్యం కలిగిన సినిమాలను ప్రోత్సహించాలని, చారిత్రక వ్యక్తుల మీద తీసిన సినిమాలకు తగిన సహకారం అందించాలని తెలంగాణ ప్రభుత్వం విధానంగా పెట్టుకుందని సిఎం కెసిఆర్ చెప్పారు. ఇంతకుముందు రుద్రమదేవి సినిమాకు కూడా పన్నుమినహాయింపు ఇచ్చామని, ఇప్పుడు గౌతమిపుత్రశాతకర్ణికూడా మినహాయింపు ఇస్తున్నట్టు సిఎం చెప్పారు. వెంటనే పన్నుమినహాయింపు ఆదేశాలు జారీచేయాలని కూడా కెసిఆర్ అధికారులను ఆదేశించారు. కాగా, కెసిఆర్ చేతులుమీదుగా ప్రారంభమైన తమ చిత్రం కేవలం 79 రోజుల్లో దిగ్విజయంగా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్దమైందని బాలకృష్ణ చెప్పారు. జనవరి 12రిలీజయ్యే ఈ సినిమా ఫస్ట్ షో చూడాలని కెసిఆర్ ను కోరినట్టు బాలకృష్ణ తెలిపారు. ఆ సందర్భంలోనివే ఈ ఫొటోలు..

 

 

 
 
 
Related News

JournalistDiary