AP / Politics
నంద్యాలకు బాలయ్య రావాల్సిందే!
71 days ago

101వ సినిమా ముగించుకుని 102 క్కూడా టెంకాయి కొట్టేసుకున్న బాలయ్య, తన ఫస్ట్ ప్రయార్టీ సినిమాలేనంటూ ఫిక్సై
పోయారు. శాతకర్ణి సందడి తర్వాత హిందూపురం వైపు చూడడం కూడా మానేసినట్టు ఆయనపై విమర్శలొచ్చాయి. మరి
ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌కి సెమీఫైనల్స్‌గా భావిస్తున్న నంద్యాల బైపోల్‌ని బాలయ్య ఏవిధంగా ట్రీట్ చేస్తారు? గెలుపుకోసం
సర్వశక్తుల్ని ఒడ్డుతున్న చంద్రబాబునాయుడు, నంద్యాల్లో బాలకృష్ణ చేత కూడా ప్రచారం చేయించవచ్చని ఓ ఫీలర్ బయటకువచ్చింది.

భూమా అఖిలప్రియ కూడా ఈ విషయంలో బాబు, బాలయ్యపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. మరోరెండు వారాల్లో జరగనున్న ఉపఎన్నికల ప్రచారం ఇప్పటికే హీటెక్కిపోయింది. వైసీపీ- టీడీపీలు నువ్వానేనా అన్నరీతిలో ఓటర్ల వెంటపడుతున్నారు. రోజా కూడా నంద్యాల గల్లీల్లో హల్‌చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ తమ చేతిలోవున్న కరిష్మాటిక్ వెపన్‌ని మాత్రం ఎందుకు ఉపేక్షిస్తుందని అంటున్నారు. బాలకృష్ణ.. రెండురోజులు వీలుచూసుకుని నంద్యాల వైపు కన్నేస్తారా? లేక నాకెందుకొచ్చిన లొల్లి అని సైలెంట్‌గా వుండిపోతారా? అనేది తేలాల్చివుంది.

 

Read Also

 
Related News
JournalistDiary