AP and TS / Politics
కేసీఆర్ దగ్గర శాతకర్ణి ‘డీల్’
288 days ago

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో భేటీ అయ్యారు నందమూరి బాలకృష్ణ. తన 100వ సినిమా గౌతమిపుత్రశాతకర్ణికి వినోదం పన్ను రద్దు చేసినందుకు కెసిఆర్ కు బాలయ్య కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా కెసిఆర్ ను కలిసేందుకు బాలకృష్ణ అసెంబ్లీకి చేరుకున్నారు. తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి బాలయ్యను సాదరంగా ఆహ్వానించారు. అయితే, సిఎం కెసిఆర్ అప్పటికే అసెంబ్లీనుంచి వెళ్లిపోవడంతో బాలకృష్ణ ప్రగతి భవన్ కు వెళ్లి కెసిఆర్ ను కలిశారు. కాగా, గౌతమిపుత్రశాతకర్ణి సినిమాకు రెండు తెలుగురాష్ట్రాల్లో వినోదపుపన్ను మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే.

 

Read Also

 
Related News
JournalistDiary