AP and TS / Entertainment
బాలకృష్ణ ‘స్టంపర్’ అంటే ఏంటి?
24 days ago

బాలకృష్ణ ‘పైసా వసూల్’ స్టంపర్ వచ్చేసింది. దీనికి అభిమానుల నుంచి మాంచి రెస్పాన్స్ వస్తోంది. అసలు విషయానికొస్తే.. స్టంపర్ పేరుతో కొత్త తరహా పబ్లిసిటీకి శ్రీకారం చుట్టింది యూనిట్. నిర్మాణ సంస్థకు చెందిన యూట్యూబ్‌ సైట్‌లోనే స్టంపర్ అంటే ఇది అంటూ క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. టీజర్ కా బాప్, ట్రైలర్ కా బేటా (టీజర్ కి అబ్బలాంటిది.. ట్రైలర్‌కి బిడ్డ లాంటిది) అన్నమాట. అంటే రెగ్యులర్‌గా వచ్చే టీజర్.. ట్రైలర్‌కి ఇది భిన్నంగా వుంటుంది. సినిమా నేచర్ ఏంటన్న ఇండికేషన్స్ కూడా స్టంపర్‌లో దొరుకుతాయి. పైసావసూల్‌తో మొదలైన ఈ స్టంపర్ స్టయిల్ పబ్లిసిటీని రాబోయే సినిమాలు కూడా ఫాలో అవుతాయో లేదో చూడాలి.

 
 
Related News